
SPECIES
సహజ సిద్ధంగా అడవులలో చాలా అరుదుగా లభించే భూచక్రదుంప భూచక్రగడ్డ (ఆంగ్లం: Maerua oblongifolia (syn. Maerua arenaria, Niebhuria arenaria)) అనునది ఔషధ మొక్క. దీనిని భూచక్ర దుంప అని కూడా అంటారు. ఇది తక్కువ ఎత్తు పెరిగే మొక్క.కొన్ని సందర్బాలలో 2 నుండి 3 మీటర్లు ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు దీర్ఘచతురస్రాండాకారంలో 2 నుంచి 4.5 సెంటీమీటర్ల పొడవు, 0.7 నుంచి 2.5 సెంటీమీటర్ల వెడల్పుతో ఉంటాయి. దీని పుష్పం తెల్లగా లేత ఆకుపచ్చని కేశరములను కలిగి అందంగా ఉంటుంది. దీని రక్షక పత్రాలు దీర్ఘవృత్తాండాకారంలో కొద్దిగా మొనదేలినవి నాలుగు ఉంటాయి. దీని పండు స్థూపాకారంగా 3 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు, 1 నుంచి 1.5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది, అప్పుడప్పుడు దీని కాయలు ముడులు పడినట్లుగా, మెలికలు తిరిగినట్లుగా లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇది స్థూపాకార మందమైన కాండము, దళసరి ఆకులు,బాగా సువాసన గల పూలు కలిగి ఉండును.దీని వేరు అర అడుగు నుంచి అడుగు ఆడ్డుకొలత వ్యాసంతో మూడు నుంచి ఆరు అడుగుల పొడవు ఉంటుంది. స్థూపాకారంలో ఉండే ఈ గడ్డను అడవి ప్రాంతాల నుంచి స్వీకరించి పలుచని పొరలుగా ఈ గడ్డను కోస్తూ అమ్ముతుంటారు. ఈ గడ్డ రుచిగా, తీయగా ఉండేందుకు ఈ గడ్డ పలుచని పొరలకు చక్కెర నీటిని అద్దుతారు. ఇది ఇండియా, పాకిస్తాన్,ఆఫ్రికా, సౌదీ అరేబియాలో ఉంటుంది. దీని వేరు భాగము కొబ్బరి కంజె లాగ రుచికరంగా ఉండును. ఇది పంచదారతో కలిపి తింటారు. గిరిజన ప్రాంతాల
via GBIF · Kew POWO
via Wikidata · CC0
Discovered by embedding cosine similarity (sentence-transformers MiniLM, 384-dim).